Cinema

హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కి..హై వోల్టేజ్ బడ్జెట్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,రూలర్ మూవీస్  బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ ని అందుకోలేకపోయింది.ఇసారిఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో సింహా,లెజెండ్ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ.ఈ సినిమా టీజర్ కి యూట్యూబ్ లో 55 మిలియన్స్ వ్యూస్ అలాగే 500k లైక్స్ లతో అల్ టైం రికార్డ్ తో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుటుంది.ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ను తమిళనాడులోని ఒక ఆలయంలో చిత్రయునిట్ షూటింగ్  జరుపుకుటుంది.ఈ షూటింగ్ లో బాలకృష్ణ పాటుగా ఇతర ప్రధాన నటీనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు.  

 

ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని 5 కోట్ల భారీ సెట్ లో యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో జరగుతుంది.ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది అని టాక్.ఇక ఈ సినిమాని భారీ అంచనాలతో దసరా పండగ కి విడుదల చేసే ఆలోచనలో చిత్రయునిట్ ఉన్నారు అని సమచారం.        

About the author

admin

Leave a Comment