పవన్‌పై పోసాని కామెంట్స్.. ఫ్యాన్స్ ఊరుకుంటారా?

వైఎస్ జగన్ మద్దతుదారుడైన పోసాని కృష్ణమురళి ఈసారి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పవన్ చేసిందంతా తప్పేనని ఆయన చెప్పారు. తొలుత చంద్రబాబుకు సపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన్నే తిట్టడం పవన్ చేసిన పెద్ద మిస్టేక్ అన్నారు. ఆయన దృష్టిలో అది తప్పు కాకపోవచ్చుగానీ తన దృష్టిలో అది తప్పేనన్నారు. బహుశా ప్రజలు కూడా అలాగే భావించారేమో… అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని పోసాని వ్యాఖ్యనించారు. ‘‘పవన్ తొలుత చంద్రబాబుకు […]

పెళ్లి చేసుకునేది ఒకరు.. తాళి కట్టేది ఇంకొకరు!

అవి గుజరాత్‌లోని సుర్ఖేదా, సనాదా, అంబల్‌ అనే గ్రామాలు.. అక్కడో విచిత్ర సంప్రదాయం ఉంది. పెళ్ళి ఒకరు చేసుకుంటే, తాళి ఇంకొకరు కడతారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం! వారి సంప్రదాయం.. పెళ్లి చూపులైన మొదలు వివాహతంతు ముగిసేవరకూ వరుడు, వధువు చూసుకోకూడదు. తొలుత వధువు పెళ్లి వరుడి సోదరితో జరుపుతారు. వరుడి సోదరిని కూడా అచ్చం పెళ్ళి కూతురిలా చేసి, పెళ్లిపీటలపై కూర్చోపెడతారు. ఆమెనే వధువు మెడలో తాళి కడుతుంది. ఒకవేళ పెళ్లి కొడుక్కి […]

వృద్ధుడిని ‘ఆ ఆశ’తో ఆటాడుకున్న అమ్మాయి.. నిండా ముంచేసింది బాబోయ్!

పాపం ఓ వృద్ధుడు.. అమ్మాయి వలలో నిండా ముంచేశాడు. ఓ అమ్మాయి ఆయనలో లేనిపోని ఆశలు రేపి, చివరకు జేబులు ఖాళీ చేసి ఉడాయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివాసముండే 68 ఏళ్ల వృద్ధుడికి ఫేస్‌బుక్‌లో ఏంజెలా డొనాల్డ్‌ అనే విదేశీ యువతితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ గంటల కొద్దీ చాటింగ్‌ చేసేవారు. ఈ క్రమంలోనే ఒకరోజు ‘ఫొటోల్లో మీరు ఎంతో అందంగా ఉన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటూ ఆ అమ్మాయి చెప్పింది. దీంతో […]

లాజిక్‌తో బాంబ్ పేల్చిన సాయిపల్లవి

ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ అందంగా కనిపించడం కోసం తహతహలాడుతుంటే… సాయిపల్లవి మాత్రం మొటిమలతోనే వెండితెరపై కనిపిస్తోంది. దర్శకుల ఒత్తిడి మేరకు కొన్ని పాటలకోసం ముఖానికి రంగు పూసుకుందే తప్ప.. మిగతా సీన్లలో నేచురల్‌గానే ఉంటుంది. అస్సలు మేకప్ వేసుకోదు. అటు ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌లోనూ నటించడం లేదు. ఎందుకని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది అమ్మడు. ‘‘మనది దేవుడు ఇచ్చిన రంగు.. దాన్ని క్రీములతో మార్చాలనుకోవడం సరికాదు. నాకు ఫెయిర్‌నెస్ యాడ్స్‌లో నటించడం ఏమాత్రం ఇష్టం […]

ఎన్టీఆర్ ఘాట్‌లో తారక్ ఫైర్

ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ప్రతిఏటా టిడిపి నేతలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ‘ఎన్టీఆర్ ఘాట్’ వద్ద నివాళులు అర్పిస్తుంటారు. ఈ సందర్భంగా ‘ఘాట్’ను పూలతో కలర్‌ఫుల్‌గా అలంకరిస్తారు. కానీ ఈసారి అలా చేయలేదు. అక్కడక్కడ కొన్ని పూలు చల్లారే తప్ప.. మునుపటిలా డెకొరేట్ చేయలేదు. ఇది చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన జూ.ఎన్టీఆర్.. అక్కడి అధికారులపై మండిపడ్డారు. ఎందుకు డెకొరేట్ చేయలేదంటూ నిలదీశాడు. అందుకు వాళ్ళు ఏం బదులిచ్చారో తెలీదు కానీ.. తారక్ ఆగ్రహంతో అక్కడి వాతావరణం […]

పాల్‌ని అడ్డంగా బుక్ చేసిన మహిళ.. ఎలాగంటే?

ప్రజాసేవే లక్ష్యమని ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన కేఏ పాల్.. దాని ముసుగులో మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని తాజా ఉదంతం తేల్చి చెప్తోంది. తక్కువ ఖర్చుతోనే అమెరికాకు పంపిస్తానని చెప్పి, ఇప్పుడు ప్లేటు తిప్పేసి మోసం చేశాడంటూ ఆయనపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాల్‌పై కేసు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రామచంద్రాపురం అశోక్‌నగర్‌కు చెందిన కాట్రగడ్డ సత్యవతి కూతురు అమెరికాలో ఉంటోంది. తను కూత కూతురు వద్దకు వెళ్ళాలనుకున్న […]

భర్తపై హీరోయిన్ మర్డర్ అటెంప్ట్.. అడ్డుగా ఉన్నాడని..

ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఒక టాప్ హీరోయిన్… ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ కేసులో అడ్డంగా బుక్కైంది. కట్టుకున్న భర్తనే కడతేర్చాలని కుట్ర పన్నింది. కొడుకు చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని, అందుకే అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో భర్తను చంపేందుకు వ్యూహం పన్నిందని తెలిసింది. కానీ భర్త ఎలాగోలా తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించడంతో.. ఆమె బండారం బట్టబయలైంది. ఆ హీరోయిన్ పేరు రంజితా కౌర్.. 80వ దశకంలో బాలీవుడ్‌ని ఏలిన తారల్లో […]

పెళ్ళైన మూడోరోజే పంతులతో పెళ్ళికూతురు పరార్

పెళ్లైన మూడో రోజే భర్తను వదిలి, తనకు వివాహం జరిపించిన పంతులతో పెళ్ళికూతురు పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అసత్‌ గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల యువతికి మే 7వ తేదీన అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం చేశారు. వీరి పెళ్ళిని వినోద్‌ మహారాజ్‌ అనే పురోహితుడు జరిపించాడు. పెళ్లైన మూడో రోజు తన పుట్టింట్లో కొన్నిరోజులు ఉండి వస్తానని పెళ్ళికూతురు చెప్పడంతో.. అందుకు అత్తారింటివాళ్ళు ఒప్పుకున్నారు. చెప్పినట్టుగానే […]

అమ్మాయిలు కావాలా.. అయితే ఇలా చేయండి

‘అమ్మాయిల కావాలా?’ అంటూ ఓ దొంగల ముఠా ఒక ప్రభుత్వ ఉద్యోగిని నిండా దోచేసుకున్నారు. తమ దగ్గరున్న అందమైన యువతుల ఫోటోలు చూపించి, వాళ్ళతో రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చని నమ్మబలికి అతడికి కుచ్చుటోపి పెట్టారు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఆ ఉద్యోగి.. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నల్లగండ్ల ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. ఈనెల 22న అతనికి ఒక డేటింగ్ సైట్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. స్థానికంగా ఉండే అమ్మాయిలతో […]

అసలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇదిగో! (వీడియో)

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో తాను చూపిందంతా నిజమేనని వర్మ మొదట్నుంచీ డప్పు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచి లోతుగా సమాచారం సేకరించానని… వాటి ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కించానని చెప్తున్నాడు. తన చిత్రంలో అబద్ధాలే లేవని, అన్ని నిజాలే చూపించానని వర్మ ప్రతి ఇంటర్వ్యూలోనూ వెల్లడించాడు. వర్మ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో అన్ని నిజాలే ఉంటాయని జనాలు సైతం భ్రమలో ఉన్నారు. అంతటితో ఆగకుండా… సినిమా చూసొచ్చాక చంద్రబాబును […]