ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్..! సంచలన నిర్ణయానికి రంగం సిద్ధం

ఏపి సిఎం వైఎస్ జగన్ తన మార్క్ పాలన చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నవరత్నాల హామీలను నెరవేర్చే క్రమంలో పనులు మొదలవ్వగా కొన్నాళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైన కొన్ని విషయాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించబోతున్నారు. ముఖ్యంగా ఏపిలో ఎస్సీ వర్గీకరణపై వైఎస్ జగన్ అద్భుతమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారట. ఎస్సీలకు ఇచ్చే ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా మాలలకే ఎక్కువ వాటా అనుభవిస్తున్నారని మాదిగల నుండి విమర్శలు వచ్చాయి. మాదిగ, రెల్లిలు పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదని మంద […]

బాబూ మీ “కియా” అవినీతి పుట్ట త్వరలోనే పగిలిద్ది : విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్

ఎన్నికల వేళ వైస్సార్సీపీ ఎంపీ వేసిన ట్వీట్లు ఎంతగా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చాక కూడా ఏమాత్రం తగ్గకుండా బాబు కి చుక్కలు చూపించేలా సంచలన ట్వీట్లతో దుమ్మురేపుతున్నాడు. గత తెలుగు దేశం ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రముఖంగా చెప్పుకొచ్చింది కియా మోటార్స్ గురించి.. అనంతపురం లో అద్భుతాన్ని సృష్టించామని తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ కి విరుద్ధంగా విజయసాయిరెడ్డి ఇప్పుడు బాబూ మీ కియా అవినీతి పుట్ట […]

ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన జగన్.. జనం కోసం జగన్

2019 ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అవుతానని వైఎస్ జగన్ ప్రకటించిన ప్రతీసారి.. ఆ పదవి కోసమే అతడు రాజకీయాల్లోకి వచ్చాడేమోనని హేళన చేసేవాళ్ళు విమర్శకులు! కానీ జనం కోసమే తాను ఈ పదవిని అధిష్టించానని ప్రమాణస్వీకారం రోజే చాటిచెప్పారాయన! ఇప్పుడు మరో గొప్ప పని చేసి.. ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చారు. ప్రతిపక్షాలు, విమర్శకులు సైతం శభాష్ అని కొనియాడేలా చేశారు. సిఎం కాన్వాయ్ వెళ్తున్న దారిలో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం.. పోలీసులు ఎక్కడి వాహనాల్ని అక్కడే […]

బిజెపి ఎమ్మెల్యే దాష్టీకం.. నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొట్టాడు

ప్రజాసేవే తన ధ్యేయమని మైకుల ముందు ఊదరగొట్టిన ఓ బిజెపి ఎమ్మెల్యే.. తాజాగా తన అసలు రూపం బయటపెట్టాడు. నీటి సమస్యను పరిష్కరించమని అడిగిన పాపానికి ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టాడు. ఆ దెబ్బలను తాళలేక ఆ మహిళ కిందపడిపోయినా వదల్లేదు.. కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని నరోదా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) మద్దతుదారైన నీతూ తేజ్వానీ తనతోపాటు కొందరు మహిళల్ని వెంట వేసుకుని బిజెపి […]

రాజన్న రాజ్యమంటే ఇదేనా సీఎం జగన్ సార్.. మీవాళ్లే ఇలా తెగిస్తే..!

ఏపి ఎలక్షన్స్ లో భారీ విజయాన్ని అందుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన కూడా ఊహించని విధంగా గెలుపు పొందారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త బాధ్యతలను తీసుకున్న జగన్ వివిధ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగాలపై సమీక్షలు నిర్వహిస్తున్నాడు. వైసిపి గెలిచిన సందర్భంగా ఇంకా అనేక ప్రాంతాల్లో వైసిపి కార్యకర్తలు ఇంకా బాణా సంచాలు కాలుస్తున్నారు. అయితే అది అక్కడి ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారుతుందట. ఎదురుతిరిగితే మా ప్రభుత్వ […]

జగన్ టీమ్ ఇదేనా.. క్యాబినెట్ మంత్రుల లిస్ట్..!

ఏపి ఎన్నికల్లో ఈసారి జనాలందరు వైఎస్ జగన్ కు ఓటేశారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమైన వైఎస్ జగన్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. తద్వారా వైసిపి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈమధ్యనే ఏపి కొత్త సిఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి జగన్ క్యాబినెట్ లో మంత్రులెవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. జిల్లాల వారిగా ఎవవెరవరికి తన మంత్రివర్గంలో స్థానం ఇస్తున్నారో […]

బాబు గారి వెకేషన్ టైం..!

జరిగిన ఎలక్షన్స్ లో ఏపిలో వైసిపి ప్రభుత్వం ఏర్పరచింది. టిడిపి పార్టీ ఘోర వైఫల్యాన్ని పొందింది. ఇలాంటి టైంలో చంద్రబాబు ఫ్యామిలీతో వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ నేతలతో తమ తదుపరి కార్యక్రమాలను చర్చిస్తూనే ఇన్నాళ్లు కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేని చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ట్రిప్ చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక జరుగబోయే విజయవాడ ఎంపి, ఎమ్మెల్యే స్థానాల్లో నిలబడే అభ్యర్ధులతో కూడా […]

తెలుగు తమ్ముళ్ళకి పృథ్వి దిమ్మదిరిగే పంచ్.. మాటల్లేవు.. మాట్లాడుకోటాల్లేవు

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వైస్సార్సీపీ తరపున గత కొన్నాళ్లుగా మీడియాలో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. వైస్సార్సీపీ అధికారం సొంతం చేసుకున్న తర్వాత పృథ్వి మరింత దూకుడు పెంచాడు.చంద్రబాబు నాయుడు నిన్న హైదరాబాద్ లోని ఆసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భాన్ని పురష్కరించుకొని పృథ్వి చంద్రబాబు పై నిన్న వేసిన పంచ్ కి తెలుగు తమ్ముళ్ళకి మాటల్లేవని చెప్పుకుంటున్నారు. “మేము ఆంధ్రాని అంత అభివృద్ధి చేశాం.. […]