చంద్రబాబు అదిరిపోయే భవిష్యత్తు ప్రణాళిక.. మొదలైన కసరత్తు

chandrababu-naidu

తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో గెలుపులు ఓటమిలు ఎన్నో చూసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ఓటమికి కారణాలు తెలుసుకుంటూనే అదిరిపోయే.. మరియు ప్రజానీకం అందరికీ దగ్గరయ్యే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంట. పార్టీకి సంబందించిన వివిధ స్థాయి నాయకులతో మరియు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఘోర పరాజయంపై స్వచ్చందంగా పోస్ట్ మార్టం నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారట.

ఇక కొత్త ప్రభుత్వంపై తమ విధానాన్ని కూడా పార్టీ నాయకులకి చెప్పారట. 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు జగన్ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయరాదని.. అలాగే టీవీ డిబేట్లలో పాల్గొనకుండా వారి వారి నియోజకవర్గాలలో ప్రజలను కలుస్తూ వారికి దగ్గరయ్యేలా, వారి సమస్యలపై పోరాటం చేయమని ప్రధానంగా సూచించారట. ఓటమికి కుంగిపోకుండా మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకి చేరువగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలనీ సూచించారట.

అలాగే సీనియర్ల మార్గదర్శకత్వంలో యువతకి పెద్ద పీట వెయ్యాలని పలువురు సూచించారట. రామ్ మోహన్ నాయుడు, దేవినేని అవినాష్, పరిటాల శ్రీరామ్ తదితర యువ నాయకుల సేవలని తగిన సమయంలో పార్టీ పునరుద్దరణకు ఉపయోగించుకోవాలని ప్రధానంగా సూచించారట.ఓటమిని తదుపరి తమ గెలుపుకి నాందిగా మలచుకుని ముందుకువెళ్లాలని.. పార్టీలో జరిగిన కొన్ని లోపాలను నిజాయితీ గా గుర్తించి తమ పోరాటాన్ని కొనసాగించాలని ఈ ఐదేళ్లు ఎంతో నిబద్దతతో పనిచేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జరిగిన నష్టానికి అందరూ బాధ్యత వహించి ప్రజలకి దగ్గరగా పని చేయవలసిందిగా కోరారట.

Leave a Reply

*