ఆ స్టార్ హీరోతో సినిమాలు చేయనని తెగేసి చెప్పిన సెక్సీ హీరోయిన్

స్టార్ హీరోల సరసన నటించాలనే కోరిక ఎవరికీ ఉండదు? వారితో ఒక్క సినిమా చేసిన తమ దశ తిరుగుతుందనే ఉద్దేశంతో భామలందరూ క్యూ కడతారు. కానీ తాను మాత్రం సల్మాన్‌ఖాన్‌తో ఇంకెప్పుడూ నటించనని బాంబ్ పేల్చింది దిశా పతాని! ‘భారత్’ చిత్రంలో సల్మాన్ సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈ సెక్సీ బ్యూటీ.. ఇకపై సల్మాన్‌తో కలిసి నటించనని తెగేసి చెప్పింది. కారణం.. వయసు తేడా ఎక్కువగా ఉండటమేనని అంటోంది ఈ భామ!

కానీ.. ఇండస్ట్రీలో మాత్రం అసలు కారణం మరొకటి ఉందని ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈమధ్య ప్రియాంకపై సల్మాన్ పంచ్ వేస్తూ.. తనతో సినిమా చేయడం కోసం చాలామంది ఆడవాళ్ళు తమ మొగుళ్ళను వదిలేసి వస్తున్నారంటూ నోరు జారాడు. ఈ వ్యాఖ్యలపై సల్మాన్‌ని నేరుగా విమర్శించలేక నిరసనగా దిశా పతాని ఆయనతో ఇంకెప్పుడూ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ, సల్మాన్‌ లాంటి స్టార్ హీరోతో చేయనని దిశ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Leave a Reply

*