Trending

ఎవరు మీలో కోటీశ్వరులు మహేష్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ప్రోమో వీడియో

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ.ఎం.కే సూపర్ ఎపిసోడ్ ప్రోమో రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సూపర్ స్టార్ మహేష్ సర్ ప్రైజ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడో జరిగినా సరైన టైం కోసం ఎదురుచూశారు జెమిని టీవీ టీం. ఇక త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ షో ప్రోమో కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. వెల్కం మహేష్ అన్నా అంటూ తారక్ అనగా.. కరెక్ట్ ఆన్సర్ నే అటు తిప్పు ఇటు తిప్పి.. నీకన్నా గురువుగారే బెటర్ అంటూ ఎన్.టి.ఆర్ తో సరదాగా అంటాడు మహేష్.

మొత్తానికి ముందు చెప్పినట్టుగానే ఈ సూపర్ కాంబో ఎపిసోడ్ ఫ్యాన్స్ అందరికి సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రోమోనే ఇలా ఉంటే ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment