జామపండు తినండి.. జుట్టు రాలడాన్ని ఆపండి

అవును.. జామపండును తరచూ తీసుకుంటే, జుట్టు రాలే సమస్యను అధిగమించడమే కాదు, మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయని, ప్రతిరోజూ భోజనంతోపాటు మూడు నెలలు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు.

  • * గుండె జబ్బుతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. శరీరంలో రక్తం సరఫరా సాఫీగా జరిగి, గుండెకు మేలు చేస్తుంది.
  • * రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.
  • * బాగా మాగిన జామపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి తింటే.. రోగనిరోధక శక్తి పెరిగి, ఎనర్జీ వస్తుంది.
  • * ఉదయం, రాత్రి వేళల్లో భోజనం చేసిన అనంతరం జామపండు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
  • * రోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.
  • * పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఎందుకంటే.. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆపుతుంది.
  • * ఒక కప్పు పచ్చి జామకాయ ముక్కలను బాగా ఎండబెట్టి, అందులో అరచెంచా మిరియాలు, అరచెంచా సైందవ లవణాన్ని వేసి, మెత్తగా పొడి చేసి నిల్వఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే, దంతాలు గట్టి పడటమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
  • * జామపండు గుజ్జులో పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం తగినంతగా లభిస్తాయి.
  • * ఎదిగే పిల్లలకు, గర్భిణులకు జామపండు ఓ టానిక్‌లా పనిచేస్తుంది.
  • * జామపండు చర్మాన్ని పదిలంగా ఉంచడంతోపాటు జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటికి మేలు చేస్తుంది. చూపు కోల్పోకుండా కాపాడుతుంది.