పూజితా పొన్నాడా ముద్దు ముచ్చట్లు.. లిప్ లాక్ కు సిద్ధమే కాని..!

తెలుగులో పుట్టి పెరిగినా కన్నడలో మొదట అవకాశం రావడంతో అక్కడ సత్తా చాటుతున్న భామ పూజితా పొన్నాడ. తెలుగులో రాం చరణ్ రంగస్థలం సినిమాలో ఆది లవర్ గా కనిపించిన పూజిత కన్నడ పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే తెలుగులో మాత్రం సరైన అవకాశాలు అందుకోవడం లేదు. ఈమధ్య రాయ్ లక్ష్మి నటించిన వెంకటలక్ష్మి సినిమాలో పూజిత నటించింది. లేటెస్ట్ గా హవీష్ హీరోగా చేస్తున్న 7 సినిమాలో ఆమె నటిస్తుంది.

సినిమాలో ఆరుగురు హీరోయిన్స్ లో పూజిత ఒకరు. మిగతా హీరోయిన్స్ అందరితో సినిమాలో హీరోతో లిప్ లాక్ ఉంది. కాని తనతో లేదని కథ డిమాండ్ చేస్తే తాను కూడా లిప్ లాక్ కు సిద్ధమే అని అంటుంది పూజిత పొన్నాడ. వెంకటలక్ష్మిలో తన అందచందాలతో అదరగొట్టిన పూజిత ఆ సినిమా ముందు చెప్పిందొకటి ఆ తర్వాత తీసిందొకటని వాపోయింది. సినిమా డిమాండ్ ను బట్టి తాను లిప్ లాక్ కూడా చేస్తానని అంటుంది.

Leave a Reply

*