తారక్‌పై జెడి చక్రవర్తి షాకింగ్ కామెంట్స్.. ఆ తర్వాత ఇంకెప్పుడూ కారెక్కలేదట!

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ గురించి ఇప్పటివరకూ అందరూ ఒకలా రియాక్ట్ అయితే.. జెడి చక్రవర్తి మాత్రం మరోలా స్పందించారు. ‘హిప్పీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన… ఇన్నాళ్ళూ ఎవ్వరికీ తెలియని తారక్‌లోని ఓ వినూత్నమైన కోణాన్ని ఆయన బయటపెట్టారు.

ప్రతిభకు తారక్ ప్రత్యక్ష సాక్షి అని కొనియాడిన జెడి.. అతనిలో అవతలి వాళ్ళను టెన్షన్ పెట్టడమనే క్వాలిటీ ఉందని, అదంటే తనకు చాలా ఇష్టమని చమత్కరించారు. ఓరోజు తాను తారక్‌తో కలిసి కారులో వెళ్ళానని, అప్పుడతను ‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ పాట పెట్టి, కళ్ళు మూసుకుని 110 స్పీడులో కారు నడిపాడని జెడి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఆ పాట ఎందుకు చేశానా? అని అనిపించిందని జోక్ పేల్చారు. మళ్లీ జీవితంలో తాను కారు ఎక్కనని తారక్‌తో చెప్పానని, చెప్పినట్లుగానే ఎప్పుడూ ఎక్కలేదని చెప్పారు. అయితే.. తారక్‌లో టన్నుల కొద్దీ ట్యాలెంట్ ఉందని చెప్పుకొచ్చారు.

మరో విషయం ఏమిటంటే.. ఇదే ఇంటర్వ్యూలో ఇతర హీరోల గురించి ప్రశ్నించినప్పుడు సాధారణంగా రియాక్ట్ అయిన జెడి.. తారక్ గురించి అడిగినప్పుడు మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయారు. బహుశా ఇలా ఉత్సాహంతో ఉప్పొంగే స్పందన తొలిసారి జెడినే ఇచ్చారేమో! తనకు, తారక్‌కి మధ్య మంచి బాండింగ్ ఉందని.. తామిద్దరికీ ఒకరికొకరంటే ఎంతో అభిమానమని ఆయనన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

*