Gossips

ఎన్.టి.ఆర్ కోసం ఆ అందాల భామ ని దించుతున్నారట..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో సెకండ్ హిట్ కు ప్రయత్నిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే హీరోయిన్ విషయంలో బాలీవుడ్ భామని సెలెక్ట్ చేసినట్టు టాక్. ఎంతోమంది హీరోయిన్స్ పేర్లు వినపడగా ఫైనల్ గా ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

జాన్వి కూడా సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో నటించడానికి అమ్మడు ఇంట్రెస్ట్ గా ఉంది. ఎన్.టి.ఆర్ లాంటి హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని జాన్వి అనుకుంటుంది. తెలుగులో శ్రీదేవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలానే ఆమె తనయురాలు జాన్వి కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ అందుకోవాలని చూస్తుంది. ఎన్.టి.ఆర్ తో జాన్వి రొమాన్స్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment