Politics

అరాచక సంస్కృతి ఆపేయండి.. ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎన్.టి.ఆర్ హాట్ కామెంట్స్..!

శుక్రవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారు. నిన్న ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి చెబుతూ చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

అంతేకాదు ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా ఏమన్నా ఉంటే తేల్చుకోవాలి కాని రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్ల మీద వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇక నిన్న జరిగిన ఘటనపై ఎన్.టి.ఆర్ కూడా స్పందించారు.

అందరికి నమస్కారం.. మాట మన వ్యక్తిత్వానికి సమానం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం.. అలాంటి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి కానీ, వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని అన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనసుని కలచి వేసింది. ఎప్పుడైతే ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుంది. వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబంలో ఒకడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా.. ఒక భర్తగా.. ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను.. ఈ దేశానికి ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నానని అన్నారు ఎన్.టి.ఆర్. రాజకీయ నాయకులందరికి ఒక్కటే విన్నపం. దయచేఏసి ఈ అరాచక సంసృక్తిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి.. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే.. ఇది ఇక్కడితో ఆగిపోతుంద్దని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని అన్నారు ఎన్.టి.ఆర్.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment