‘మహర్షి’ 3 వారాల కలెక్షన్స్.. ఆ బయ్యర్లు గల్లంతే!

బాక్సాఫీస్ వద్ద 3 వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ‘మహర్షి’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.95.91 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసినట్లు తేలింది. అందునా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.75.24 కోట్ల షేర్ నమోదు చేసినట్టు సమాచారం! ఓవరాల్ బిజినెస్‌తో (రూ.94.60 కోట్లు) పోల్చుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను దాటినట్టే కానీ.. ఏరియాల పరంగా మాత్రం ఇంకా కొన్ని చోట్ల కొంత మొత్తం రికవరి చేయాల్సి ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే… సీడెడ్, ఓవర్సీస్‌లలో నష్టాలు మిగలడం పక్కా అని తేలిపోయింది. ఇంకొన్ని చోట్ల వసూళ్ళు తూలుగుతూ మూలుగుతూ నమోదు అవుతున్నాయి. ఫుల్ రన్‌లోపు ఆయా ఏరియాల బయ్యర్లు గట్టెక్కుతారో లేదో చెప్పడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. అందరివాడు అవుతాడనుకున్న ‘మహర్షి’.. కేవలం కొందరివాడిగానే మిగిలిపోవాల్సి వస్తోందన్నమాట!

ఏరియాలవారీగా కలెక్షన్స్ :

 • నైజాం : 28.56
 • వైజాగ్ : 9.56
 • సీడెడ్ : 9.30
 • గుంటూరు : 7.50
 • ఈస్ట్ గోదావరి : 6.80
 • వెస్ట్ గోదావరి : 5.51
 • కృష్ణా : 5.41
 • నెల్లూరు : 2.60
 • ఏపీ+తెలంగాణ షేర్ : రూ.75.24 కోట్లు
 • రెస్టాఫ్ ఇండియా : 10.57
 • ఓవర్సీస్ : 10.10
 • టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ.95.91 కోట్లు

Leave a Reply

*