Cinema

మెగాస్టార్ సరసన మరోసారి ఆ బ్యూటీ..?

ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ వెంటనే సైరా నరసింహా రెడ్డి సినిమాతో మరో అల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఇక ఈ సినిమా తరువాత మెగా స్టార్ చేస్తున్న 152 వ సినిమా ఆచార్య.ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా లో మెగాస్టార్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

ఇక ఈ సినిమాని కొనేదల ప్రొడక్షన్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని 120 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి ఫస్ట్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుసా సినిమాలను అనౌన్స్ చేసాడు.అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాలో ఒక్క ముఖ్య మైన పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా హీరొయిన్ గా ఫిక్స్ అయింది అని సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment