నందమూరి మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్.. ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వారసుడు..!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి దాదాపు మూడు నాలుగేళ్లుగా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాల్లో చేస్తాడని అనుకోగా అది మిస్సైంది. ఆదిత్య 369 సినిమా పార్ట్ 2 సినిమాలో మోక్షజ్ఞ చేస్తాడని వార్తలు రాగా అది కూడా రూమరే అని తేలింది. ఓ పక్క నందమూరి వారసుడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ గట్రా నేర్చుకుంటున్నాడని చెప్పగా ఈమధ్య లీకైన మోక్షజ్ఞ పిక్ చూసి అవేవి చేస్తున్నట్టు కనిపించలేదని తెలిసింది.

ఇదిలాఉంటే మోక్షజ్ఞ గురించి ఓ రూమర్ బాగా వైరల్ అయ్యింది. ఈ నందమూరి వారసుడు బంజారా హిల్స్ లో ఓ కాఫీ షాప్ లో బాగా కనబడుతున్నాడట. దాదాపు 6 నెలల నుండి మోక్షజ్ఞ అక్కడకు రోజు వస్తున్నాడని. తన గ్యాంగ్ తో అక్కడే చాలాసేపు కాలక్షేపం చేస్తున్నాడని అంటున్నారు. తన సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే మోక్షజ్ఞ మాత్రం ఇవేమి పట్టనట్టు కాఫీ షాప్ లో టైం పాస్ చేస్తున్నాడట.

ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అసలు మోక్షజ్ఞకు హీరో అవ్వాలన్న ఆలోచన లేదట.. బాలయ్య బలవంతం మీదనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మోక్షజ్ఞకు బిజినెస్ మీద బాగా దృష్టి ఉందని తెలుస్తుంది. మరి బాలయ్య వారసుడు ఇలా సిని కెరియర్ లైట్ తీసుకోవడం నందమూరి ఫ్యాన్స్ ను కంగారులో పడేస్తుంది.

Leave a Reply

*