నారా లోకేష్ షాకింగ్ నిర్ణయం.. రాజకీయాలకి బై బై.. ఆ రంగానికి షిఫ్ట్ !!

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియా లో ఒకటే వార్తలు వస్తున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన లోకేష్ ఓడిపోవటం తో పాటు తెలుగు దేశం కూడా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎటువంటి అనుభవం లేకుండగా కేవలం ముఖ్యమంత్రి తనయుడు అన్న ఒకే ఒక్క కారణంతో మంత్రి ని చేయటం, అది కూడా తెలుగు దేశం ఘోర పరాజయానికి ప్రధానకరణమని చెప్పుకొచ్చారట. అలాగే నారా లోకేష్ లో మాస్ లీడర్ గా ఎదిగే లక్షణాలు ఏమాత్రం లేవని తెలుగుదేశం అంతర్గత సమావేశాల్లో ఖరాఖండిగా చెప్పారట.

ఈ నేపథ్యంలో స్వయం విమర్శ చేసుకున్న నారా లోకేష్ తన వల్ల పార్టీ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశ్యంతో రాజకీయాలకి బై చెప్పాలని నిర్ణయించుకున్నారట. అయితే పార్టీకి తన అవసరం ఉందనిపిస్తే మాత్రం కూతవేటు దూరంలో తాను ఉంటానని చెప్పినట్లు వినికిడి. ఇక రాజకీయ రంగం కాకుండా తాను తేలికగా పని చేయగలిగే లేదా పని చేయించగలిగే రంగం ఏమున్నదా అని ఆలోచించినప్పుడు సినిమా రంగమే కరెక్ట్ అని పలువురు సూచించారంట. ఎలాగూ తన మామ బాలయ్య ఇంకా సినిమారంగంలోనే ప్రముఖ కథానాయకుడిగా చలామణి అవుతున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , నారా లోకేష్ వంటి హీరోలు ఎలాగూ తనకు అండగా ఉంటారు కాబట్టి అలాగే ప్రజలకి కూడా తేలికగా చేరువయ్యే రంగం కాబట్టి సినిమా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

*