Gossips

ఎన్.టి.ఆర్ 32.. ఆ డైరక్టర్ తో ఫిక్స్..?

లేటెస్ట్ గా తన 30, 31 సినిమాల గురించి చెప్పి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన తారక్ ఆ తర్వాత ఎవరితో చేస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఎన్.టి.ఆర్ 32వ సినిమా డైరక్టర్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ ఈసారి మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడని టాక్.

మహానటి తర్వాత ప్రాజెక్ట్ కె అంటూ ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు నాగ్ అశ్విన్. వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమా వస్తుంది. ప్రాజెక్ట్ కె తర్వాత ఎన్.టి.ఆర్ తోనే ప్రభాస్ సినిమా ఉంటుందని టాక్. ఈలోగా తారక్ కొరటాల శివ సినిమా.. కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె చేస్తున్న నాగ్ అశ్విన్ ఈ తారకరాముడితో ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తాడో చూడాలి.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment