Gossips

ఎన్.టి.ఆర్ 30, 31 స్పెషల్ అప్డేట్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రెండు భారీ సినిమాలు ప్లాన్ చేసినట్టు తెలిసిందే. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో రాబోతుంది. ఆల్రెడీ జనతా గ్యారేజ్ తో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి వస్తుంది. కొరటాల శివ ఎన్.టి.ఆర్ కోసం ఓ రివెంజ్ డ్రామా స్టోరీతో సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్స్ చాలా కొత్తగా ఉంటాయని టాక్.

ఇక ఎన్.టి.ఆర్ 31వ సినిమా కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఉంటుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్ తారక్ తో కూడా కె.జి.ఎఫ్ తరహాలో భారీ స్కేల్ ఉన్న సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ 2, సలార్ సినిమాల తర్వాత ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment