దుమ్మురేపే ‘సాహో’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలు.. యూట్యూబ్‌కి మూడినట్లే!

‘సాహో’ సినిమా టీజర్‌ను రంజాన్ పండుగ సందర్భంగా విడుదల కానున్నట్టు ఇదివరకే ఓ సంకేతం వచ్చేసింది. దర్శకుడు సుజీత్ కూడా అవుననే సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. టీజర్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉండటం ఖాయమనుకుంటున్నారు.

ఇదివరకే విడుదల చేసిన రెండు ప్రోమోల్లో యాక్షన్ సీన్స్ ఆకాశమే హద్దుగా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. అందుకే.. ఈ టీజర్‌పై అందరిలోనూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ విజువల్ ట్రీట్‌గా ఉంటుందని సమాచారం! హాలీవుడ్ మూవీని తలపించే విధంగా టీజర్‌ను కట్ చేస్తున్నట్టు తెలిసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో.. ‘హాలీవుడ్ మ్యూజిక్ బైట్’ రాయల్టీ హక్కుల్ని అక్షరాల రూ.15 లక్షలు ఇచ్చి సొంతం చేసుకున్నారట!

నిజానికి.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఒక సంగీత దర్శకుడ్ని సంప్రదించారు కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని ఇలా డబ్బులిచ్చి సంగీతం కొన్నట్టు తెలుస్తోంది. స్టన్నింగ్ యాక్షన్ సీన్, మైండ్‌బ్లోయింగ్ గ్రాఫికల్ విజువల్స్‌తోపాటు ప్రభాస్ చెప్పే రెండు డైలాగ్స్‌తో ఈ టీజర్ ఉండనుందని వార్తలొస్తున్నాయి. ఇది చదువుతుంటేనే ఇంత ఎగ్జైటింగ్‌గా ఉంది.. మరి టీజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో మీ స్థాయికే వదిలేస్తున్నా! దెబ్బకు గత యూట్యూబ్ రికార్డులన్నీ పాతాళానికి పాతుకుపోవాల్సిందే!

Leave a Reply

*