కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. ఆ పని చేస్తున్న రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి మిగతా డైరెక్లర్లలా సినిమా నిర్మాణ విషయంలో హడావుడి చేయరు. ఆచితూచి అడుగులు వేస్తారు. ఆలస్యమైన ఫర్వాలేదు గానీ తొందరపడకూడదనేది ఆయన పాలసీ! అందుకే.. ఆయన సినిమాలు చాలా ఆలస్యంగా వస్తుంటాయి. అలాంటి ఆయన ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. స్లోగా కాకుండా ఎంత వీలైతే అంత త్వరగా పనులు ముగించాలని వేగం పెంచారు. అవును.. RRR సినిమా విషయంలోనూ ఆయన ఈ జోరు పెంచినట్టు తెలిసింది.

ముందుగా ప్రకటించినట్లుగానే జూలై 30వ తేదీన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే జక్కన్న స్పీడ్ పెంచారు. ఇప్పటికే డైసీ తప్పుకోవడం.. చరణ్, తారక్‌లు గాయపడడం కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. దీంతో ఇకపై ఎలాంటి బ్రేకులు ఇవ్వకూడదని ఆయన టైట్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారట! ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ముగిసేలా పక్కా స్కెచ్ వేసినట్టు తెలిసింది. అంతేకాదు.. పనిలో పనిగా విఎఫ్ఎక్స్ కూడా ముగించేలా జక్కన్న ప్రణాళికలు రచించినట్టు సమాచారం!

ఎప్పుడూ లేనంతగా జక్కన్న ఈసారి ఇలా వేగం పెంచడానికి కారణం.. కాస్టింగేనని తెలుస్తోంది. ఇందులో ఇతర భాషా పరిశ్రమకి చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో.. వాళ్ళకు అనుగుణంగా డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే.. తీసుకున్న డేట్స్‌ని సమయానుకూలంగా ముగించేందుకు జక్కన్న స్పీడ్ పెంచారంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. తప్పకుండా జూలై 30కి ఈ చిత్రం విడుదల అవ్వడం ఖాయం!

Leave a Reply

*