ఈరోజు రంజాన్ సందర్భంగా సెలబ్రిటీస్ అందరు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మహర్షి హిట్ తో జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. రంజాన్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇంతకీ మహేష్ ఏమని మెసేజ్ పెట్టాడంటే.. హ్యాపీ ఈద్.. ప్రేమ, శాంతి, సక్సెస్ తో అందరూ సంతోషంగా ఉండేలా దేవుని ఆశీస్సులు మీతో ఉండాలని కోరుకుంటున్నా అంటూ.. ఈద్ ముబారక్ .. ఈద్ ఉల్ ఫితుర్ అని మెసేజ్ పెట్టారు.
ఇక ఇందులో మరో సర్ ప్రైజ్ ఏంటంటే మహేష్ సెల్ఫీ తీసుకోవడమే.. ఈ సెల్ఫీలో సూపర్ స్టార్ ఫ్యామిలీ అంటే నమ్రత, గౌతం కృష్ణ, సితారలతో పాటుగా తను కూడా ఉన్నాడు. ఎప్పటిలానే మహేష్ చార్మింగ్ లుక్ అదరగొట్టగా సూపర్ స్టార్ రంజాన్ సూపర్ విష్ తో అందరు సంబరపడుతున్నరు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఈ నెల సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Happy Eid😊 May you all be blessed with love, peace and prosperity… #EidMubarak #EidUlFitr pic.twitter.com/rVjC6mv0Ht
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2019