కేటీఆర్ కి చుక్కలు చూపించిన రేవంత్ రెడ్డి.. రేవంత్ వేసిన చురకలకి కేటీఆర్ కి నోట మాట లేదు!!

గత అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి మరీ ఓడించిన తెరాస .. దేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయింది. కాంగ్రెస్ కి అనుకూలంగా లేని మల్కాజిగిరి లో స్వల్ప మెజారిటీతో అయినా రేవంత్ రెడ్డి గెలిచాడంటే అది మాములు విషయం కాదు.

ఈ సందర్భంలో కేటీఆర్ “స్వల్ప మెజారిటీ తో గెలిచిన గెలుపు ఒక గెలుపేనా” అన్నట్లు తెలిసుకున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ కి అదిరిపోయే పంచ్ వేశాడు. 2009 వ సంవత్సరంలో కేటీఆర్ గెలుపు సిరిసిల్లలో ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొని మాట్లాడాలని దిమ్మదిరిగే కౌంటర్ వేశాడు.స్వతంత్ర అభ్యర్థిపై 175 ఓట్ల అత్యల్ప మెజారిటీ తో అది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బయటపడ్డ నువ్వా నా గెలుపు గురించి మాట్లాడేది అని రేవంత్ వేసిన చురకలకి కేటీఆర్ కి నోట మాట రాలేదంట.

Leave a Reply

*