ఎన్టీఆర్ రావాల్సిందేనని గోలగోల చేస్తున్న వర్మ

ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చవిచూసినప్పటి నుంచి ఏపీలో ఎటుచూసినా ఎన్టీఆర్ నామస్మరణమే! ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ఆ పార్టీ తిరిగి కోలుకోవాలంటే, తారక్ వల్లే సాధ్యమవుతుందని సినీ, రాజకీయ ప్రముఖులు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదే టైంలో మాజీ సిఎం చంద్రబాబు, బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు సంధించాడు.

ఒకవేళ తారక్ టిడిపి బాధ్యతల్ని స్వీకరిస్తే.. ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసిన డిజాస్టర్ ఫెయిల్యూర్‌ని ఏపీ ప్రజలు తక్షణమే మరిచిపోతారని వర్మ తెలిపాడు. ఎన్టీ రామారావు మనవడైన తారక్ ఒక్కడే ఆ పార్టీని కాపాడగలడని, ఆ సామర్థ్యం అతనికొక్కడే సాధ్యమని కొనియాడాడు. ఒకవేళ తారక్‌కి నిజంగానే తన తాతపై గౌరవం ఉంటే.. వెంటనే తెలుగుదేశం పగ్గాలు చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశాడు. ‘‘హే తారక్.. నీకు నీ తాతపై గౌరవం ఉంటే, ఆయన్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నుంచి, అలాగే ముందు నుంచి తూట్లు పొడుస్తున్న నారాలోకేష్ నుంచి టిడిపిని కాపాడు. జై ఎన్టీఆర్’’ అంటూ వర్మ ట్వీటాడు.

ఓ ఎన్టీ రామారావు అభిమానిగా తాను ఈ రిక్వెస్ట్ చేస్తున్నానని, దయచేసి మీ తాతను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో మాత్రం చేతులు కలపొద్దని కోరాడు. చంద్రబాబుతో చేతులు కలిపి ఆయనకంటే దారుణంగా ఎన్టీరామారావుని వెన్నుపోటు పొడిచిన బాబాయ్‌ (బాలయ్య)లాగా తప్పటడుగులు వేయొద్దని సూచించాడు. బహుశా తారక్ వరకే తన అభిప్రాయాల్ని వర్మ వెల్లడించి ఉంటే పరిస్థితులు మామూలుగా ఉండేవేమో గానీ.. సీన్‌లోకి చంద్రబాబు, బాలయ్యలను సైతం తీసుకురావడంతో వివాదం నెలకొంది.

Leave a Reply

*