Trending

ఆ విషయములో టీ20 కెప్టెన్ గా రోహిత్ హిట్.. విరాట్ ఫట్..!

టీ20 వరల్డ్ కప్ లో ఘోర పరాజయపాలైన టీం ఇండియా రీసెంట్ గా న్యూజిల్యాండ్ తో ఆడిన టీ20 సీరీస్ లో ఘన విజయాన్ని అందుకుంది. 3 మ్యాచ్ ల సీరీస్ లో వరుసగా 3 మ్యాచ్ లను గెలిచి సత్తా చాటింది టీం ఇండియా. జట్టులో యువ ఆటగాళ్లను పెట్టుకుని రోహిత్ శర్మ సారధ్యంలో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. టీ20 ఫార్మెట్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపర్ హిట్ అనిపించుకుంది.

అంతేకాదు న్యూజిల్యాండ్ తో జరిగిన 3 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు టాస్ గెలిచి.. మ్యాచ్ లను గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించాడు రోహిత్. విరాట్ కొహ్లి కెప్టెన్ గా ఉన్న టైం లో టాస్ గెలవడం చాలా అరుదు. ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ 22 మ్యాచ్ లను ఆడగా అందులో 18 మ్యాచ్ లను విజయాన్ని అందించాడు. అలా చూస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ 81% సక్సెస్ రేటు ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడని యువ ఆటగాళ్లతో రోహిత్ ఈ సీరీస్ విజయాన్ని అందుకోవడం కెప్టెన్ గా అతని సామర్ధ్యాన్ని నిరూపించిందని అంటున్నారు విశ్లేషకులు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment