Cinema

USలో RRR.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..!

సినిమా తీయడం ఒక లెక్క.. దాన్ని ప్రమోట్ చేయడం మరో లెక్క.. అంతే భారీ రేంజ్ లో రిలీజ్ చేయడం అసలైన లెక్క. ఈ లెక్కలన్ని పర్ఫెక్ట్ గా తెలిసినోడు రాజమౌళి. తన సినిమా రికార్డులు తాను మాత్రమే బద్ధలు కొట్టాలి అనుకునేలా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. బాహుబలితో రికార్డులు కొల్లగొట్టగా ఇప్పుడు ఆ రికార్డులను సైతం ఆర్.ఆర్.ఆర్ తో బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా యూ.ఎస్ లో అతి పెద్ద చైన్ లింక్ అయిన సినీ మార్క్ తో RRR రిలీజ్ అవుతుంది. యూ.ఎస్ లో 350 మల్టీప్లెక్స్ లు ఉన్న సినీ మార్క్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాను 288 మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే దాదాపు 1000 స్క్రీన్స్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుంది. అన్ని స్క్రీన్స్ లో బొమ్మ పడితే కచ్చితంగా కలక్షన్స్ రికార్డుల మోత మోగాల్సిందే. రాజమౌళి ప్లాన్ అదిరిందని అందరు అనుకుంటున్నారు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment