Cinema

RRR, రాధే శ్యాం, భీమ్లా నాయక్ సినిమాలకు పెద్ద దెబ్బ..!

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల మీద ఇంకా పట్టు విడవలేదు. ఒకప్పుడు స్టార్ సినిమాకు ఎక్కడైనా రేట్లు పెంచుకునే అవకాశం ఉండేది. పెంచిన రేట్లని వారం పాటు అమలులో ఉంచేవారు. తెలంగాణాలో ఇప్పటికీ స్టార్ సినిమా అంటే టికెట్ ప్రైజ్ పెంచేస్తుంటారు. అయితే ఏపీలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అక్కడ స్పెషల్ షోస్, టికెట్ ప్రైజ్ హైక్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఓ పక్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానితో నిర్మాతల మండలి వరుస చర్చలు జరుపుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం టికెట్ ప్రైజ్ హైక్, స్పెషల్ షోస్ పై పర్మిషన్ ఇవ్వలేదు.

సంక్రాంతి సినిమాలకు కూడా ఇలానే టికెట్ ప్రైజ్ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు స్పెషల్ షోస్ కి పర్మిషన్ కూడా ఇచ్చేలా లేరు. ఇలా అయితే భారీ స్కేల్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాలతో పాటుగా భీమ్లా నాయక్ కి కూడా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment