హైబ్రిడ్ పిల్లపై అభిమానుల గుస్సా.. అమ్మడికి అసలేమైంది..!

ప్రేమమ్ సినిమాతో సౌత్ పరిశ్రమని షేక్ చేసిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో సంచలన విజయం అందుకుంది. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లా ఒక్కటే పీస్ అంటూ రెచ్చిపోయిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో మంచి అవకాశాలను అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి ఈమధ్య ప్రతి సినిమాలో రొటీన్ పాత్రలే చేస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన సూర్య ఎన్.జి.కే లో కూడా సాయి పల్లవికి షాక్ తగిలింది.

ఇదిలాఉంటే ఎన్.జి.కే ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో చాటింగ్ చేస్తానని చెప్పిన సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందట. ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ కు ఫలానా టైం కు తను చాట్ చేస్తా అని చెప్పిన అమ్మడు అనివార్య కారణాల వల్ల లైవ్ లోకి రాలేదట. అంతే అమ్మడి మీద అభిమానులంతా ఫైర్ అవుతున్నారు. మీ కోసం పనిపాట వదిలి పెట్టుకుని వెయిట్ చేస్తుంటే మీరు ఇలా హ్యాండ్ ఇస్తారా అంటూ ఆమెని టార్గెట్ చేశారు. అయితే పొరపాటు జరిగిందని ఫ్యాన్స్ కు సర్ధిచెప్పిన సాయి పల్లవి ఈసారి అలా జరుగకుండా చూసుకుంటానని చెప్పింది.

Leave a Reply

*