మోసం చేసి అడ్డంగా బుక్కైన సాయిపల్లవి.. ఏకిపారేసిన ఫ్యాన్స్

తన తాజా చిత్రం ‘ఎన్జీకే’ ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తానంటూ సాయిపల్లవి ఒక సమయం ఫిక్స్ చేసింది. సినిమాతో పాటు తన గురించి అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తానంటూ ఊరించింది. దీంతో ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన నటితో చిట్‌చాట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అడగని ప్రశ్నలు సంధించి, ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టాలని చూశారు.

మొత్తానికి సాయిపల్లవి ఫిక్స్ చేసిన ఆ టైం రావడంతో.. ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించేశారు. ఆమె ఎప్పుడెప్పుడు జవాబిస్తుందా? అని వేచిచూశారు. కానీ ఆమె ఎవ్వరికీ సమాధానం ఇవ్వలేదు. కారణాలేంటో తెలీదు కానీ.. చెప్పిన సమయానికి సాయిపల్లవి తన ఫ్యాన్స్‌తో చాట్ చేయలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చిట్‌చాట్‌కు వస్తానని చెప్పి రాకపోవడంతో ఆమెపై మండిపడ్డారు. ‘‘మా సమయం వృధా చేసుకుని మరీ లైవ్ చాట్‌పై ఆసక్తి చూపిస్తే.. నువ్వు ఆన్‌లైన్‌లోకి రాకుండా మమ్మల్ని మోసం చేస్తావా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే.. క్రేజ్ ఉంది కదా అని పొగరు చూపించకూడదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇలా తనపై వచ్చిన కామెంట్స్‌ని గమనించిన సాయిపల్లవి.. ఆ వెంటనే హుందాగా ప్రవర్తించింది. తాను చేసింది తప్పేనని, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను చెప్పిన సమయానికి చాట్ చేయడానికి రాలేకపోయానని, ఇందుకు క్షమించమని కోరింది. ‘మరెప్పుడైనా సోషల్ మీడియాలో కలుద్దాం’ అంటూ వివరణ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త చల్లబడ్డారు. ఇన్నాళ్ళూ ఫ్యాన్స్ అభిమానం చూసిన సాయిపల్లవి.. తొలిసారి వారి కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

Leave a Reply

*