ఎన్టీఆర్ కి జంటగా సాయి పల్లవి.. ఇద్దరు మహామహులు జంటగా నటిస్తే ఎట్టుంటాదో తెలుసా ??

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న RRR సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా మొదట హాలీవుడ్ బ్యూటీ Daisy Edgar Jones ని తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె సినిమా చేయకుండా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుండి బాలీవుడ్ నుండి శ్రద్ధ కపూర్ , పరిణీతి చోప్రా వంటి వారి పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఏ పేరు ని కూడా RRR టీం అఫీషియల్ గా ప్రకటించలేదు.

ఈ సందర్భంలో ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మొదట మలయాళం , తరువాత తెలుగు మరియు తమిళ పరిశ్రమలలో తన డ్యాన్స్ తో.. తన నటనతో.. మరీ ఎక్కువగా తన ఒరిజినల్ ఆటిట్యూడ్ తో హీరోలకి ధీటుగా పేరు తెచ్చుకొన్న సాయి పల్లవి పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది.ఎన్టీఆర్ పక్కన సాయి పల్లవి అంటే..అటు డ్యాన్సులో.. ఇటు నటనలో ఇద్దరు మహామహులు జంటగా నటిస్తే ప్రతీ అభిమానికి కనుల పండగే మరీ. ఇక ఏమి ఆలోచించకుండా సాయి పల్లవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి జక్కన్న గారు.. ఏమంటారు ఫ్రెండ్స్ ?