రాజకీయల్లోకి శ్రీరెడ్డి ఎంట్రీ.. ఏ పార్టీనో తెలిస్తే షాకే!

కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాలపై యాక్టివ్‌గా ఉన్న శ్రీరెడ్డి.. ఆ సమయంలోనే తాను పాలిటిక్స్‌లోకి రావొచ్చనే సంకేతాలిచ్చింది. ఆమె వైసిపికే ఎక్కువ మద్దతు ఇస్తుండడంతో.. అందులో చేరొచ్చనే సందేహాలు ఏర్పడ్డాయి. ఆ పార్టీ నుంచి ఆహ్వానాలు కూడా అందడంతో… త్వరలోనే అమ్మడు ఆ పార్టీ కండువా కప్పుకోవచ్చనుకున్న భావించారు. కానీ.. శ్రీరెడ్డి అనూహ్య ట్విస్ట్ ఇచ్చింది. తమిళ రాజకీయాలవైపు తన చూపు మళ్ళించింది.

ఏపీలో రాజకీయాలు పూర్తిగా చల్లబడ్డాయి. పైగా పవన్‌పై విమర్శలు చేసి తీవ్ర విమర్శల్ని మూటగట్టుకుంది. ఇక్కడ ఆమె ఇమేజ్ బాగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ పాలిటిక్స్‌లో అడుగిడితే ఆమెకు పెద్దగా ఒరిగేమీ ఉండదు. అందుకే.. తమిళ రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అమ్మడు త్వరలోనే డిఎంకే పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతోందని తెలుస్తోంది. ఆల్రెడీ ఆ పార్టీ నేతలతో ఈ అమ్మడు రహస్య మంతనాలు జరిపిందని, తాను పార్టీ చేరాలనుకుంటున్నానని వారితో తన అభిప్రాయం పంచుకుంది. అందుకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతోంది.

చెన్నైలో శ్రీరెడ్డి మంచి ఫాలోయింగ్ ఉంది. తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ.. అమ్మాయి కావడంతో విస్తృత స్థాయిలో మద్దతు లభిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసమే ఆమె రాజకీయాలవైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కానీ.. ఎప్పుడు ఎంటరవుతుందనేదే సస్పెన్స్! మరి.. ఇండస్ట్రీని వదిలి పాలిటిక్స్‌లోకి వెళ్ళానులకున్న ఆమె ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.