మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’.. ఆ రెండు తెలుగు సినిమాలకు కాపీ అటగా..!

మహర్షి హిట్ తో మంచి జోష్ కనబరుస్తున్న సూపర్ స్టార్ మహేష్ ఈమధ్యనే సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ముహుర్తం జరుపుకున్నాడు. అనీల్ రావిపుడి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్ముస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ నెల రెండో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నారట. 2020 సంక్రాంతికి పక్కా ఈ సినిమా రిలీజ్ చేస్తారని అంటున్నారు.

ఇక ఈ సినిమా కథ వెంకటేష్ వారసుడొచ్చాడు, మహేష్ అతడు సినిమాలను పోలి ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఆర్మీలో చనిపోయిన స్నేహితుడి కోసం తన ప్లేస్ లో ఇంటికొచ్చిన హీరో అక్కడ పరిస్థితుల వల్ల కొద్దిరోజులు ఉండాల్సి వస్తుందట. ఫ్రెండ్ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయంగా నిలుస్తాడట. ఇదే కథతో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. మరి అనీల్ రావిపుడి ఈ సినిమా ఎలా తీస్తాడో చూడాలి. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ అందుకున్న అనీల్ మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.

Leave a Reply

*