ఆ దమ్ము లేదంటూ తారక్‌పై తేజ సంచలనం

ఇండస్ట్రీలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ గురించి ఎవ్వరినీ అడిగినా సరే.. ఎగ్జైట్‌మెంట్‌తో ఊగిపోతారు. అతని గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అతనికి సాటి ఎవ్వరూ లేరని.. డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నింటిలోనూ తారక్‌ తనకుతానే సాటి అంటూ ప్రశంసలతో ముంచెత్తుతారు. స్టార్ హీరోలు సైతం యంగ్‌టైగర్‌కి జై కొడతారు. అతని ఎనర్జీ లెవెల్స్‌కి తాము సరిపోమని స్వయంగా స్టార్స్ ఒప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి.

కానీ దర్శకుడు తేజ మాత్రం ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి చెప్పమంటే.. ఎవ్వరూ ఊహించని సమాధానంతో ఆశ్చర్యపరిచాడు. తారక్ గురించి తానేం చెప్పలేనని, అసలు అతని గురించి చెప్పేంత దమ్ము తనకు లేదని చెప్పుకొచ్చాడు. తారక్‌తో కలిసి తాను పనిచేయలేదు కాబట్టి ఆయన గురించి తనకేమీ తెలియదని… కేవలం రెండు, మూడు సందర్భాల్లో కలిశానే తప్ప అంతకుమించి ఆయనతో అటాచ్‌మెంట్ ఏమీ లేదని తేజ కుండబద్దలు కొట్టాడు. కాకపోతే.. ఒక్కమాటలో చెప్పాలంటే అతడో గొప్ప ప్రొఫెషనల్ అని, అంతకంటే పెద్దగా తనకేం తెలియదంటూ తేజ చేతులు దులిపేసుకున్నాడు. బహుశా ఇండస్ట్రీలో తారక్ గురించి ఇలా డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది ఒక్క తేజనే ఏమో!