తెలుగు తమ్ముళ్ళకి పృథ్వి దిమ్మదిరిగే పంచ్.. మాటల్లేవు.. మాట్లాడుకోటాల్లేవు

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వైస్సార్సీపీ తరపున గత కొన్నాళ్లుగా మీడియాలో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. వైస్సార్సీపీ అధికారం సొంతం చేసుకున్న తర్వాత పృథ్వి మరింత దూకుడు పెంచాడు.చంద్రబాబు నాయుడు నిన్న హైదరాబాద్ లోని ఆసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భాన్ని పురష్కరించుకొని పృథ్వి చంద్రబాబు పై నిన్న వేసిన పంచ్ కి తెలుగు తమ్ముళ్ళకి మాటల్లేవని చెప్పుకుంటున్నారు. “మేము ఆంధ్రాని అంత అభివృద్ధి చేశాం.. ఇంత అభివృద్ధి చేశాం అని బాజా కొట్టుకుంటున్నారు కదా! మరి ఇప్పుడు మీ చంద్రబాబు గారి Health Checkup దగ్గరికి వచ్చేసరికి మీరు అభివృద్ధి చేసిన ఆంధ్రాలో హాస్పిటల్స్ లేవా ? అదే జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తే తెలుగు దేశం వాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు కదా.. ఇప్పుడు చెప్పండి సమాధానం” అంటూ పృథ్వి తెలుగు తమ్ముళ్ళకి దిమ్మదిరిగే పంచ్ వేశాడు.

తెలుగు తమ్ముళ్లు మాత్రం ధీటుగా సమాధానం చెప్పటంలో విఫలం అయ్యారు. పృథ్వి వేసిన పంచ్ కి ఇటు వైసీపీ అభిమానులు మాత్రం మాటల్లేవు మాట్లాడుకోటాల్లేవు అంటూ సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

*