బాబు గారి వెకేషన్ టైం..!

జరిగిన ఎలక్షన్స్ లో ఏపిలో వైసిపి ప్రభుత్వం ఏర్పరచింది. టిడిపి పార్టీ ఘోర వైఫల్యాన్ని పొందింది. ఇలాంటి టైంలో చంద్రబాబు ఫ్యామిలీతో వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ నేతలతో తమ తదుపరి కార్యక్రమాలను చర్చిస్తూనే ఇన్నాళ్లు కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేని చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ట్రిప్ చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక జరుగబోయే విజయవాడ ఎంపి, ఎమ్మెల్యే స్థానాల్లో నిలబడే అభ్యర్ధులతో కూడా చర్చలు జరుపుతున్నారట.

జూన్ 4న వారితో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తుంది. ఇక జూన్ 6 న చంద్రబాబు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ఇన్నాళ్లు ప్రజాసేవలో కుటుంబానికి సరైన సమయం కేటాయించలేని బాబు ఇక ఇప్పుడు ఉన్న టైంలో వారితో కలిసి రిలాక్స్ అవనున్నారు. ఇక ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ పనితీరుని ప్రశ్నిచేలా ముందుకు సాగనున్నారు. టిడిపిలో హేమా హేమీలు అనుకున్న వారు కూడా ఈసారి ఖాళీ అవడం ఆశ్చర్యకరం. ఇప్పటికే ఎన్నికల్లో ఎందుకు ఓడాం అన్న దానిమీద పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

*