విశ్వక్ సేన్ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. దాస్ ఫైనల్ గా ఏమన్నాడంటే..!

వెళ్లిపోమాకే, ఈనగరానికి ఏమైంది సినిమాలతో హీరోగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న విశ్వక్ సేన్ హీరో కమ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా ఫలక్ నుమా దాస్. లాస్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా పక్కా మాస్ మూవీగా ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాకు పర్వాలేదన్న టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాపై కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారని, సినిమా పోస్టర్స్ చింపేస్తున్నారని విశ్వక్ సేన్ మీడియా ముందుకొచ్చాడు.

తన సినిమా బాగాలేదన్న వారికి బూతు మాటలు తిట్టడంతో కొందరు హర్ట్ అయ్యారు. అయితే విశ్వక్ సేన్ మాత్రం సినిమా పైరసీ చేస్తున్న వారిని, పోస్టర్స్ చించిన వారిని తను టార్గెట్ చేసి మాట్లాడానని.. అంతే తప్ప ఒక హీరో ఫ్యాన్స్ ను ఉద్దేశించి అనలేదని చెప్పాడు. విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను ఉద్దేశించి అలా మాట్లాడాడని టాక్ అందుకే ఈ హీరో ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణ చెప్పాడు. తాను ఏ రివ్యూ రైటర్ ను, మీడియా వాళ్లను కూడా అనలేదని.. ఎవరైతే సినిమాకు నష్టాన్ని కలిగిస్తున్నారో వాళ్లను అన్నానని అయినా సరే తను నోరు జారినందుకు క్షమించండని విశ్వక్ సేన్ అన్నారు.

Leave a Reply

*