జగన్ టీమ్ ఇదేనా.. క్యాబినెట్ మంత్రుల లిస్ట్..!

ఏపి ఎన్నికల్లో ఈసారి జనాలందరు వైఎస్ జగన్ కు ఓటేశారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమైన వైఎస్ జగన్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. తద్వారా వైసిపి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈమధ్యనే ఏపి కొత్త సిఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి జగన్ క్యాబినెట్ లో మంత్రులెవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

జిల్లాల వారిగా ఎవవెరవరికి తన మంత్రివర్గంలో స్థానం ఇస్తున్నారో ఇప్పటికే ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టఫ్ ఫైట్ లో గెలిచిన వారికి మంత్రి పదవి కన్ ఫాం అని వైసిపి అధినేత వైఎస్ జగన్ ముందునుండి చెబుతూనే వస్తున్నారు. ఆయన మీటింగ్స్ లో ఒకరి ఇద్దరి పేర్లు ప్రస్థావించారట కూడా. జూన్ 8న వైఎస్ జగన్ మంత్రి వర్గం ఏర్పడుతుంది. అయితే ఒకరి ఇద్దరు తప్ప లీకైన లిస్ట్ ప్రకారంగానే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలుస్తుంది.

ఇక జిల్లాల వారిగా కాబోయే మంత్రులు ఎవరన్నది చూస్తే..

 • తూర్పు గోదావరి : పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్
 • పశ్చిమ గోదావరి : గ్రంధి శ్రీనివాస్, ప్రసాద రాజు
 • విజయనగరం : బొత్స సత్యనారాయణ
 • విశాఖపట్నం : ముత్యాల నాయుడు
 • శ్రీకాకుళం : ధర్మాన ప్రసాదరావ్
 • నెల్లూరు : మేకపాటి గౌతం రెడ్డి
 • గుంటూరు : ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, మేకతోటి సుచరిత
 • ప్రకాశం : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
 • కృష్ణా జిల్లా : సామినేని ఉదయభాను, పేర్ని నాని
 • కర్నూల్ : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
 • కడప : అంజద్ భాషా, శ్రీనివాసులు
 • చిత్తూర్ : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 • అనంతపురం : అనంత వెంకటరామిరెడ్డి

Leave a Reply

*