ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన జగన్.. జనం కోసం జగన్

2019 ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అవుతానని వైఎస్ జగన్ ప్రకటించిన ప్రతీసారి.. ఆ పదవి కోసమే అతడు రాజకీయాల్లోకి వచ్చాడేమోనని హేళన చేసేవాళ్ళు విమర్శకులు! కానీ జనం కోసమే తాను ఈ పదవిని అధిష్టించానని ప్రమాణస్వీకారం రోజే చాటిచెప్పారాయన! ఇప్పుడు మరో గొప్ప పని చేసి.. ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చారు. ప్రతిపక్షాలు, విమర్శకులు సైతం శభాష్ అని కొనియాడేలా చేశారు.

సిఎం కాన్వాయ్ వెళ్తున్న దారిలో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం.. పోలీసులు ఎక్కడి వాహనాల్ని అక్కడే ఆపేస్తారు. చివరికి అంబులెన్స్‌లను సైతం నిలిపివేస్తారు. సిఎం జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కూడా అదే పని చేశారు. అయితే… అంబులెన్స్‌ని గమనించిన జగన్, వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, ఆ వాహనానికి దారిచ్చారు. అవును.. మొన్న కెసిఆర్‌తో చేసిన ఇఫ్తార్ విందు అనంతరం ఈ అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది.

ఇఫ్తార్ విందు అయ్యాక జగన్ కాన్వాయ్ క్యాంపు కార్యాలయం నుంచి బయటకొస్తున్నప్పుడు.. పోలీసులు వాహనాల్ని నిలిపేశారు. అదే టైంలో అటువైపు అంబులెన్స్‌ రావడంతో.. ఓ మనిషి ప్రాణాల్ని కాపాడ్డం ముఖ్యం కాబట్టి జగన్ తన కాన్వాయ్‌ని ఆపి మరీ దారిచ్చారు. ఆయన చేసిన ఈ పనికి తెలుగు జనాలతోపాటు ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు. నిజమైన నాయకుడు అనిపించుకున్నారు.

Leave a Reply

*