రాజన్న రాజ్యమంటే ఇదేనా సీఎం జగన్ సార్.. మీవాళ్లే ఇలా తెగిస్తే..!

ఏపి ఎలక్షన్స్ లో భారీ విజయాన్ని అందుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన కూడా ఊహించని విధంగా గెలుపు పొందారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త బాధ్యతలను తీసుకున్న జగన్ వివిధ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగాలపై సమీక్షలు నిర్వహిస్తున్నాడు.

వైసిపి గెలిచిన సందర్భంగా ఇంకా అనేక ప్రాంతాల్లో వైసిపి కార్యకర్తలు ఇంకా బాణా సంచాలు కాలుస్తున్నారు. అయితే అది అక్కడి ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారుతుందట. ఎదురుతిరిగితే మా ప్రభుత్వ మేం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంటున్నారట. సామాన్య ప్రజలకు ఇలాంటి వ్యక్తులు చేసే పనుల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారట. కొన్ని చోట్ల అయితే మహిళలు అని కూడా చూడకుండా చేతులు పట్టుకొని ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారట. రాజన్న రాజ్యం వచ్చిందని ఊదరగొడుతున్న వారిని ఇదేనా రాజన్న రాజ్యం అంటే అని అడుగుతున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి దాకా ఈ ఇష్యూ వెళ్లిందా… వెళ్లినా ఆయన సైలెంట్ గా ఉన్నారా.. అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరి ముఖ్యంగా వైసిపి వారికి ఎదురు తిరిగిన వారిని ఇబ్బంది పెట్టడం అన్నది మాత్రం సరైన పద్ధతి కాదు.